ఇండియన్ ఆర్మీ లో ఉద్యొగాలు…

By | October 10, 2015

ఇండియన్ ఆర్మీ లో ఉద్యొగాలు:

భారతదేశ సైన్యం లో ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి దేశంలోని అన్ని ప్రాంతాలలోను రిక్రూట్మెంట్ అధికారులను నియమించారు. మన తెలుగు రాష్ట్రాలలో మూడు బ్రాంచిలు ఉన్నాయి.

1. విశాఖపట్నం బ్రాంచి పరిధి లో : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల అభ్యర్దులు,;

2. గుంటూరు బ్రాంచి పరిధి లో: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూర్, నల్గొండ, జిల్లాల అభ్యర్దులు,;

3. సికింద్రాబాద్ బ్రాంచ్ పరిదిలో: ఇక మిగిలిన జిల్లాలను చేర్చారు.

ఎంపిక విధానము:

ఏ కేటగిరీ లోని ఉద్యొగమైన ముందుగా దేహదారుడ్య పరీక్ష నిర్వహిస్తారు.

దేహదారుఢ్య పరీక్షలు:

దేహదారుఢ్య పరీక్షల్లో ముందుగా పరుగుపందెం నిర్వహిస్తారు. సాధారణంగా నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత దూరంతో ( సాధారణంగా 1.6 కిలొమీటర్లు) పరుగుపందెం ఉంటుంది.

ఈ దూరాన్ని పరిగెత్తడానికి అభ్యర్ధులు తీసుకున్న సమయాన్ని బట్టి మార్కులు ఉంటాయి.

(05:40 సెకన్ల కన్నా తక్కువ వ్యవధిలో పూర్తి చేసిన అభ్యర్ధులకి 60 మార్కులు

05:41 సెకన్ల నుండి నుంచి 05:50 సెకన్ల లోపు పూర్తి చేసిన అభ్యర్ధులకి 48 మార్కులు

05 :51 సెకన్ల నుండి నుండి 06:05 సెకన్ల లోపు పూర్తి చేసిన అభ్యర్ధులకి 36 మార్కులు

06:06 సెకన్ల నుండి 06:20 సెకన్లలో పూర్తి చేసిన అభ్యర్ధులకి 20 మార్కులు ఇస్తారు.

ఈ పరుగుపందెం లో అర్హత పొందడం తప్పనిసరి.

దీని తరువాత పుల్అప్స్ పరిక్ష ఉంటుంది. అర్హత పొందటానికి అభ్యర్ధి కనీసం 6 పుల్అప్స్ అయినా చెయ్యవలసి ఉంటుంది. ఈ రెండు పరిక్షల తర్వాత బార్ బాలన్స్ పరిక్ష, దేహదారుఢ్య కొలతలు పరిశీలిస్తారు.

అర్హత సంపాదించని అభ్యర్ధులని తిరస్కరిస్తారు.

ఇప్పుడు ఇండియన్ ఆర్మీ లో వివిధ ఉద్యోగాల వివరాలు చూద్దాం.

1. సోల్డ్జర్ జనరల్ డ్యూటీ :

విద్యార్హతలు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.

శరీర ధారుఢ్యం :

ఎత్తు : 165 సెంటీమీటర్లు

చాతీ : 77 నుండి 82 సెంటీమీటర్లు

పరుగు : 3 కిలొమీటర్ల పరుగు

హైజంప్ , లాంగ్ జంప్ పరిక్షలు.

2. సోల్డ్జర్ టెక్నికల్ :

విద్యార్హత :  సైన్స్ సబ్జెక్ట్ లతో 10 +2 విద్యార్హత కలిగి ఉండాలి.

ఎత్తు : 165 సెంటీమీటర్లు

చాతీ : 77 నుండి 82 సెంటీమీటర్లు

పరుగు : 3 కిలొమీటర్ల పరుగు

హైజంప్ , లాంగ్ జంప్ పరిక్షలు.

3. సోల్ద్జర్ నర్సింగ్:

విద్యార్హత : బయాలజి సబ్జెక్ట్ లతో 10 +2 విద్యార్హత కలిగి ఉండాలి.

ఎత్తు : 165 సెంటీమీటర్లు

చాతీ : 77 నుండి 82 సెంటీమీటర్లు

పరుగు : 3 కిలొమీటర్ల పరుగు

హైజంప్ , లాంగ్ జంప్ పరిక్షలు ఉంటాయి.

4. టెక్నికల్ పోస్టులు:

విద్యార్హతలు : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేధమెటిక్స్ సబ్జక్తులతో 10+2 లో కనీసం 70 % మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు.

వయస్సు : 16సం. 6 నెలల నుండి 19 సం 6 నెలల మధ్య ఉండాలి.

శిక్షణ : ఎంపిక అయిన అభ్యర్ధులకు 5 సం. శిక్షణ ఉంటుంది.

ఈ ట్రైనింగ్ పూర్తి చేసినవారికి ఇంజనీరింగ్ డిగ్రీ ప్రదానం చేస్తారు. వీరిని లెఫ్టినెంట్ ర్యాంక్లో అర్మీలోని టెక్నికల్ విభాగాలలో నియమిస్తారు.

5. టెక్నికల్ గ్రాడ్యుయేట్లు :

ఇందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు లెఫ్టినెంట్ ర్యాంక్ లో అర్మీలోని టెక్నికల్ విభాగాలో నియమిస్తారు.

6. మహిళా అభ్యర్ధులకు :

మహిళలకు అర్మీ / కోర్ సర్వీసులలో టెక్నికల్, నాన్టెక్నికల్, స్పెషల్ ఎంట్రీ స్కీంలక్రింద మూడు విభాగాలలో నియామకాలు నిర్వహిస్తారు.

i). టెక్నికల్ విభాగాలలో : ఈ విభాగంలో చేరదలచినవారు సివిల్ / మెకానికల్ / ఎలక్ట్రికల్ / టెలి కమ్యూనికేషన్ / కంప్యూటర్ సైన్స్ లలో ఇంజనీరింగ్ డిగ్రీ పొంది ఉండాలి.

ii). నాన్ టెక్నికల్ విభాగాలలో : ఈ విభాగంలో చేరదలచినవారు భి.., బి.కాం., బి.ఎస్.సి., బి.సి.., వంటి పరీక్షలలో కనీసం 60 % మార్కులతో ఉత్తీర్ణులైన వా అర్హులు.

iii). స్పెషల్ ఎంట్రీ స్కీం : ఈ విభాగంలో చేరదలచినవారు మైక్రో బయాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయొ కెమిస్ట్రీ, మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, జర్నలిజం, ఫిజిక్స్, మేథ్స్, మొదలైన సబ్జక్టులలో డిగ్రీ / పి.జి./ పి.జి. డిప్లొమా (పోస్ట్ను బట్టి ) కలిగి ఉండాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *