స్వయం ఉపాధి – పుట్టగొడుగుల ఉత్పత్తి

By | January 26, 2019

స్వయం ఉపాధి – పుట్టగొడుగుల ఉత్పత్తి

(updated on 22.04.2020)

పుట్టగొడుగుల ఉత్పత్తి: 

పుట్టగొడుగులుఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరుదీని వలన పెంచినవారికి ఆదాయముతిన్న వారికి పౌష్టికాహారము లభిస్తాయిఈ వ్యాపారము / వ్యవసాయము చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగిన వాటిలో ఒకటి. దీనికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతోందిదీని వాడకము ప్రస్తుతము పట్టణాలలో ఎక్కువగానే ఉంది. మిగిలిన ప్రాంతాలకు నెమ్మదిగా విస్తరిస్తోందిదీనిని శాకాహారముగా భావించడం వలన కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.

పుట్ట గొడుగులు అంటే ఏమిటి?

పుట్ట గొడుగులు అంటే ఏమిటో మరియు దీని గురించి వ్యవహారిక భాష లో తెలుసుకుందాం

పుట్ట గొడుగులు అంటే ఒక రకమైన ఫంగస్ మాత్రమే. అయితే కొన్ని రకములైన ఫంగస్ లు మాత్రమే తినదగ్గవి. ఇందులోని చాలా రకాలు విషపూరితాలుఈ తినదగ్గ పుట్ట గొడుగులలో రెండు రకాలు ఉన్నాయిఅవి:

       1. అడవులలో (సహజంగాపెరిగేవి.

       2. కృత్రిమ వాతావరణంలో పెంచేవి.

1. అడవులలో (సహజంగాపెరిగేవాటిలో తినదగ్గ రకాలు చాలా తక్కువ వాటిలో Guchhi, Dhingri, Shittakke, Paddy Straw వంటివి ముఖ్యమైనవి.

2. కృత్రిమ వాతావరణంలో పెంచే వాటిలొ Button Mushroom, Oyster Mushroom వంటివి ముఖ్యమైనవి. మన దేశం లో Oyster Mushroom యొక్క ఉత్పత్తి, Button Mushroom కంటే తక్కువOyster Mushroomకి డిమాండ్ విదేశాలలో ఎక్కువ.

వీటి పెంపకము మార్కెటింగ్ వంటి వివరములు:

ఈ పుట్ట గొడుగులకు ప్రత్యేకమైన సీజన్ అంటూ ఎమీ లేదుఇవి సంవత్సరం పొడవునా వస్తాయిపైగా వీటికి పెద్దగా infrastructure కూడా అవసరం లేదుఇవి పెద్దగా స్థలంను కూడా అక్రమించవు. రవాణా ఖర్చు కూడా పెద్దగా ఉండదు. వీటికి జాతీయఅంతర్జాతీయ మార్కెట్ కూడా బాగా ఉంది. ( Non voluminous with high value product). వీటికి ఇంత డిమాండ్ రావడానికి కారణాలు:

       1. ఇందులో క్రొవ్వు బాగా తక్కువ

       2. ఫొలిక్ ఆసిడ్విటమిన్లుమినరల్స్, అమినో ఆసిడ్లు ఎక్కువ.

       3. తేలికగా అరుగుతుంది.

       4. డయాబిటిక్ పేషంట్లు కూడా వీటిని తినవచ్చును. ఈ కారాణాల వలన దీనికి డిమాండ్ పెరుగుతోంది.

పుట్టగొడుగుల పెంపకం ఎలా ?

ప్రారంభంలో ఒక 20-25 చదరపు అడుగుల షెడ్ అవసరంవీటి పెంపకం ఎంత తేలికంటే వీటిని ఒక పూరి పాక లో కూడా పెంచవచ్చుఇదే షెడ్ లేదా పాకను రెండు గదులుగా విభజించుకొని ఒక దానిని విత్తుకోవడానికి మరొకదానిని పెంపకానికి వాడుకోవచ్చుఈ విత్తుకొనే గదిలో 25 నుంచి 300సె ఉష్ణొగ్రత ఉండాలి. పెంపకానికి వాడే గదిలో 23 నుంచి 250సె ఉష్ణోగ్రత ఉండేలాచూసుకోవాలిఈ గదిలో మాత్రం గాలిలో తేమ 75 – 80% కన్నా ఎక్కువ శాతం ఉండేలా చూసుకోవాలి. రెండు గదులకూ కూడా గాలివెలుతురూ ఉండేలాగా చూసుకోవాలి.

వీటికి కావలసినవి :

       1.జొన్నగోధుమ ధాన్యాలు ముడిశనగలుసజ్జ మొదలైనవి.

       2.శిలీంద్రము (దీనిని మంచి వ్యవసాయ పరిశొధనా శాల నుంచి తెచ్చుకోవాలి. ఇందులో రాజీ పడకూడదు.)

       3. పై పొట్టుతీసిన మొక్కజొన్నగడ్డి వరి గడ్డి చెరకు పిప్పి)

       4. పాలిథిన్ సంచులు

       5. ఉష్ణోగ్రతతేమలను కొలిచే థర్మామీటర్హ్యుమిడిటీ మీటర్.

గడ్డి ని 5-7 సె.మీముక్కలు గా కత్తిరించుకుని వాటిని 5-7 గంనానబెట్టిన తర్వాత వేడి చెయాలిఈ నీటిని పారబోసి 65-75 % తేమ ఉండేలా ఆరబెట్టాలి.

ముందుగా ఈ ధాన్యాలను సగం ఉడకబెట్టి గాలికి ఎండ బెట్టాలిదీనికి కాషియం కార్బొనేట్ పొడి 2 % కలపాలిఈ ధాన్యాన్ని ఖాళీ సీసాల లో నింపుకోవాలి. ఈ సీసాలను వేడి నీటిలో ఉడకబెట్టాలిఇప్పుడు తెచ్చుకున్న శిలీంద్రాన్ని 12-15 రోజులు పొదిగిన తర్వాత ఇంతకు ముందు మనం ఉడికించి పెట్టుకున్న సీసాలలోని దానితో కలిపి విత్తుకోవాలి. ఇప్పుడు రెండువైపులా తెరిచి ఉండే పాలిధిన్ సంచులను తీసుకుని ఒక వైపు మూతి కట్టి మధ్యలో 2-3 రంద్రాలు చెయ్యాలిఆ గడ్డిని సెం.మీ ఎత్తు లో ఈ సంచిలో వేసుకోవాలిదాని పైన మనం పైన చెసుకున్న దానిని వేయాలిఇలా పొరలు వెయాలిఇప్పుడు ఈ సంచి రెండొ మూతిని కట్టివేసి వరసగా పెట్టాలి. 18-25 రోజుల తర్వాత ఈ సంచులను తీసివేసి పెంపకం కోసం కేటాయించుకున్న గదిలోకి మార్చివరసగా పేర్చుకోవాలి.ఇప్పుడు వీటి పైన నీటిని తరచుగా జల్లుతూ ఉండాలి. సాదారణంగా ఇవి 4-6 రోజులలొ కోతకొస్తాయి. ఇవి సాదారణంగా 2-3 పంటలను ఇస్తాయిరోజూ కానీరోజు విడిచి రోజు కానీ కోత కొస్తాయి. ఈ విధంగా కోసిన పంటను మార్కెట్ చేసుకోవచ్చు.

పైన వివరించిన విధానము సాధారణంగా ఉపయోగించే విధానము అయితేఈ వ్యాపారం వ్యవసాయం ప్రారంభించే ముందు ఆ ప్రదేశం లేదా చుట్టు పక్కల ఊళ్ళలో ఉన్న మార్కెట్ ను అంచనా వేసుకొని ప్రారంభించుకోంటే మంచి లాభాలని పొందవచ్చు. అలాగే ఈ పుట్టగొడుగు లకు విదేశీ ఎగుమతి అవకాశములు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయివాటిని ఉపయోగించు కుంటే మంచి లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారానికి సాధారణంగా అయ్యే పెట్టుబడిదాని వలన వచ్చే లాభాలు వంటి వివరములు మరొకసారి…

All the best

One thought on “స్వయం ఉపాధి – పుట్టగొడుగుల ఉత్పత్తి

  1. Allu Tasu

    నాకు పుట్టగొడుగులు పెంపకం గురించి

Leave a Reply

Your email address will not be published.