ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు- పసుపు

By | January 26, 2019

స్వయం ఉపాధి – ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలుపసుపు

(updated on 22.04.2020)

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో పసుపుమిరప ఉత్పత్తుల ప్రోసెసింగ్ ని విడివిడిగా చేసి లాభాలను పొందుతున్న వ్యవసాయ వ్యాపారస్తులు ఉన్నప్పటికీ ఈ రెండూ కలిపి ఎన్నుకోమని ఈ రంగంలోని నిపుణులు ఔత్సాహికులకి సలహా ఇస్తారు. మనదేశంలో ఈ రెండు పంటలకి సంబంధించిన మార్కెట్ అతి పెద్దదిభారతీయ జీవన విధానంలో ఆహారపరంగానూవైద్యపరంగానూ పసుపుకి పెద్ద స్థానమే ఉందిపసుపు, మిరప మన వంటల్లో ఎక్కువగా వాడే  నిత్యావసర దినుసులలో ఒకటి అని చెప్పచ్చుఈ రెండు దినుసులు గృహావసరాలలో మత్రమే కాకుండా వ్యాపార సంస్థలకి కూడా అవసరపడతాయివ్యాపార ధృక్పథంతో పచ్చళ్ళు,  పొడులు, మొదలగు  ఆహార ఉత్పత్తులని తయారుచేసే సంస్థలకి కూడా వీటి అవసరం వుంటుంది. విస్తారమైన మార్కెట్ అవకాశాలు ఉన్న ఈ రంగంలో అవకాశాలని అందిపుచ్చుకోవాలంటే శ్రమనిజాయితీ అవసరంకొత్తగా ఈ రంగంలోకి వచ్చిన సంస్థలుచిన్నపెట్టుబడిదారులు సెమి అర్బన్ ప్రాంతాల నుంచి మొదలు పెడితే సులభంగా మార్కెట్ ని అందుకోవచ్చునుమార్కెట్ ఎక్కువ వలన లాభావకాశాలు సహజంగానే ఎక్కువగా వుంటాయి.

ఈ పరిశ్రమని స్థాపించాలంటే Food safety and standard regularity వారి నుంచి ధ్రువీకరణ పత్రం లైసెన్సులుపొందాల్సి వుంటుందిదీనితో పాటు ISI, ISO, AGMARK వంటి గుర్తింపులు బ్యాంక్ నుంచి ఋణం పొందటం లోనూమార్కెటింగ్ లోనూ ఉపయోగపడతాయి. పసుపు ప్రోసెసింగ్ గురించి ఇప్పుడు చూద్దాం:

పసుపుకొమ్ములు సేకరించాక వాటిని ఆరబెట్టితుడిచి శుభ్రం చేస్తారుతర్వాత వాటిని ఒక డ్రమ్ లో వేసి యంత్ర సహాయంతో తిప్పుతారుదీని వలన పైన ధూళి అంతా పోయి శుభ్రమవుతుందితర్వాత వాటిని గ్రేడింగ్ చేస్తారుపసుపు కొమ్ము సైజ్ ని బట్టి ఈ గ్రేడింగ్ జరుగుతుందిముడి పసుపుకొమ్ముకి ఈ విధంగా శుభ్రరపరచిన కొమ్ముకి సాధారణంగా 20 శాతం నుంచి 25 శాతం వరకు ధరలో తేడా వుంటుందిఈ విధంగా శుభ్రపరచిన పసుపు కొమ్ములని పొడి చేస్తారుఈ మొత్తం ప్రక్రియలో సుమారుగా 7% నుంచి 10% తరగు పోతుంది.

పసుపు ప్రోసెసింగ్ పరిశ్రమకి అయ్యే ఖర్చులు(సుమారుగా–లక్షలలో) :

భూమి సుమారుగా 350 sq. mts. కావలసి వస్తుంది.

అందులో 150 sq. mts బిల్డింగ్ కి కావాల్సివస్తుంది.

1. Polishing, Grading and Grinding machinery- Rs.3.00 lacs

2. Sealing and weighing machines and other assets – Rs.1.50 lacs

      Total . Rs.4.50 lacs

ఇందులో రూ. 3.25 లక్షల వరకు బ్యాంక్ లోన్ (టర్మ్ లోన్ గాపొందే అవకాశం ఉందిదీనితో పాటుగా సుమారుగా రూ. 2.00 లక్షల వరకు బ్యాంక్ లోన్ వర్కింగ్ కాపిటల్లోన్ గాపొందే అవకాశం ఉందిఅయితే ఇందులో స్థల విలువ కలప లేదు మరియు పరిశ్రమ సామర్ధ్యం 100 tonnes p.a..  సాధారణ పరిస్థితులలో సంవత్సరానికి రెండు లక్షల రూపాయల వరకు నికర లాభం వచ్చే అవకాశం ఉందిఅయితే ఇది వివిధ పరిస్థుతల పైన అధారపడుతుంది.

ఈ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఇంకా మంచి ఆదాయమును కూడా పొందవచ్చుఈ రంగం లో ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రొత్సాహకాలు ఉన్నాయివాటి గురించిఈ పరిశ్రమల గురించిన మరిన్ని వివరాలను తర్వాత తెలుసుకుందాం అయితే, ఈ వ్యాపారం ప్రారంభిచే ముందుగా మార్కెట్ సర్వే చేసుకుని తగు జాగ్రత్తలతో ప్రారంభిస్తే మంచి లాభాలను పొందవచ్చు.

All the best

Leave a Reply

Your email address will not be published.