భారతీయ భద్రతా దళాలలొ ఉద్యోగాలు

By | October 12, 2015

భారతీయ భద్రతా దళాలలొ ఉద్యోగాలు:

భద్రతా దళాలు అంటే మిలటరీ, ఎయిర్ ఫొర్స్, నేవీ. వీటినే త్రివిద దళాలు అని కూడా అంటారు. కేవలం ఇవే కాకుండా పారా మిలటరీ దళాలో కూడా నియామకాలు జరుగుతాయి. ఈ దళాలలో ఉద్యొగావకాశాల గురించి క్లుప్తంగా

పారా మిలటరీ దళాలలో ఈ విభాగాలు ఉన్నాయి :

1. బొర్డర్ సెక్యురిటీ ఫొర్సెస్ (బి.ఎస్.ఎఫ్)

2. సెంట్రల్ రిజర్వ్ పొలీస్ ఫొర్సెస్ ( సి. అర్. పి. ఎఫ్)

3. ఇండో టిబెటెన్ బొర్డర్ పొలీస్ ఫొర్సెస్ (. టి. బి. పి)

4. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫొర్సెస్ ( సి..ఎస్. ఎఫ్)

5. అస్సాం రైఫిల్స్ (. అర్)

6. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్.ఎస్. జి)

ఈ ఈ విభాగాలలో అసిస్టెంట్ కమాండెంట్స్, సబ్ఇనస్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు నియామకాలు జరుగుతాయి.

వీటికి కావలసిన అర్హతలు మొదలైన వివరాలు:

1). అసిస్టెంట్ కమాండెంట్స్ :

వయస్సు : 20 నుండి 25 సం.. మధ్య

విద్యార్హత: డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

రాత పరీక్ష, పిజికల్ ఎఫిషియన్సీ, ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక జరుగుతుంది.

ఈ పొస్టులు క్లాస్-1 ఉద్యొగాలు. కాబట్టీ ఇందులో ఎంపికయిన అభ్యర్థులు చాలా పై స్థాయి వరకు పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

2).సబ్ఇనస్పెక్టర్ :

వయస్సు: 20 నుండి 25 సం.. మధ్య

విద్యార్హత : డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

రాత పరీక్ష, పిజికల్ ఎఫిషియన్సీ, ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక జరుగుతుంది.

అలగే సబ్ఇనస్పెక్టర్ (స్టెనొ / క్లర్క్ ) ఉద్యొగాలకు వయస్సు, విద్యార్హత లలో సడలింపు ఉంది. అలాగే టైప్, షార్ట్ హ్యండ్లలో తగిన అర్హతలు ఉండాలి.

3). కానిస్టేబుల్ :

వయస్సు: 18 నుండి 25 సం.. మధ్య (విభాగాన్ని బట్టి ఇది మారుతుంది).

విద్యార్హత: 10 వ తరగతి పాసై ఉండాలి.

రాత పరీక్ష, పిజికల్ ఎఫిషియన్సీ, ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక జరుగుతుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *