ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్
యు.పి.ఎస్.సి నిర్వహించే పరీక్షలలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినషన్ ముఖ్యమైన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు వస్తాయి.
ఈ పరీక్షలకు కావలసిన విద్యార్హతలు మొదలైన వివరాలు:
వయస్సు: అభ్యర్థి వయస్సు 21 సం. నిండి 30 సం మధ్య ఉండాలి. , ఎస్.సి. ఎస్టి ఒ.బి.సి కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వయో పరిమితి లో సడలింపు ఉంది.
విద్యార్హతలు: ఎదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. అయితే వీరికి డిగ్రీ లో ఏనిమల్ హస్బండరీ, వెటర్నరీ సైన్స్, బొటనీ, జువాలజీ, జియాలజీ, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ సబ్జక్టులలో ఒక అప్షనల్ కలిగి ఉండలి. ఎగ్రికల్చర్, ఫారెస్ట్రీ సబ్జక్టులతో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యర్థులు కూడా అర్హులు.
ఈ పరీక్ష రెండచెలుగా ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్యూ నిర్వహిస్తారు.
రాత పరీక్ష లో రెండు పేపర్లు– జనరల్ ఇంగ్లీష్, జనరల నాలెడ్జె అందరికీ ఖచితంగా ఉంటాయి. మిగిలిన నాలుగు పేపర్లు ఆప్ష్నల్ పేపర్లు.
ఈ పరీక్ష రాయడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 4 అవకాశములు, ఒ.బి.సి. అభ్యర్థులు 7 సార్లు రాయవచ్చు. ఎస్.సి., ఎస్టి. అభ్యర్థులకు ఎటువంటి నిభంధన లేదు.