స్వయం ఉపాధి – మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్
(updated on 22.04.2020)
యువతరంకి ఆర్ధికంగా ఎదిగే అవకాశం ఉన్న రంగాలలో పాల ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి. ఈ రంగంలో స్వయంఉపాధి అవకాశాలు వినియోగించుకుని స్వల్ప పెట్టుబడితో అధిక లాభాలని అర్జించవచచ్చును, నలుగురికి ఉపాధి కూడా కల్పించవచ్చు.
పాల ఉత్పత్తిలో భారతదేశము మిగిలిన దేశాలన్నిటి కన్నా మొట్టమొదటి స్థానంలో ఉంది. ఒక సర్వే ప్రకారం దేశ జనాభా లో 25% మంది ప్రత్యక్షంగా, 20% పరోక్షంగా పాల మీద, పాల ఉత్పతుల మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇదివరకులా కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఇప్పుడు పాకేజ్డ్ పాల కి ప్రాధాన్యత ఇస్తున్నారు. పాల ఉత్పత్తుల వాడకం కూడా ఇదివరకు మీద ఇప్పుడు గణనీయంగా పెరిగింది. చిన్న వ్యాపారస్థులు పాలని నిలువ ఉంచె సామర్ధ్యం లేకపోవడం వలన పాలు పాడై పోయి నష్టపోతున్నారు. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటొంది. ఈ కాలంలో కాలరీత్యా వచ్చే కొరతకి ఈ నష్టం తోడవ్వడం వలన అటు వాడుకదారులు ఇబ్బంది పడుతున్నారు ఇటు పాల వ్యాపారులు నష్టపోతున్నారు.
మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ ద్వారా పాలు నిలువ ఉండే సామర్ధ్యం పెరుగుతుంది. తద్వారా పాలు పాడవడం వలన వచ్చే నష్టాన్ని నివారించవచ్చు మిగిలిన పాలతో పచ్చికోవా, పన్నీరు, పెరుగు, సుగంధి పాలు మొదలైన వాటి తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అయితే ఈ పాల ఉత్పత్తిలకి ఎంత మేరకు ఆదరణ ఉందన్న సందేహం రావచ్చు. ప్రజల పాలు, పాల ఉత్పత్తుల వినియోగం ఇలా ఉంది:
పెరుగు -7%
కోవా -7%
వెన్న-6.5%
నెయ్యి -27.5%
పనీర్-7%
పాలు -45 %.
ఈ రంగంలో ఔత్సాహిక వ్యాపారవేత్తలకి స్వయంఉపాధి అవకాశాలు మిక్కుటం గా ఉన్నాయి. ప్రకృతి, మార్కెట్ దెబ్బలతో అల్లాడుతున్న వ్యవసాయదారులు కూడా కొద్ది పెట్టుబడి తో మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ స్థాపించుకోగలితే స్థిరమైన ఆదాయం పొందవచ్చును.
ఈ వ్యాపారంలో కనీసం Rs.6.50 లక్షల పెట్టుబడి పెడితే (ఇంకా తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు) నెలకి Rs.30,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. సంస్థ లాభాలలో పయనించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటిలో ముఖ్యమైనది ప్లాంట్ స్థాపించే స్థల నిర్ణయం. ప్లాంట్, పాలు సేకరించుకోడానికి మరియు వాటిని మార్కెట్ చెయ్యడానికి అనువుగా ఉండాలి. అంటే ఎంచుకునే స్థలం అటు పాల అమ్మకందారులకి ఇటు మన వినియోగదారులకి దగ్గరగా ఉండేలా ఎంచుకోవడము గనుక సాధ్యపడితే రవాణా ఖర్చులు కలసి వస్తాయి. రోజుకి 500 లీటర్ల పాలు ప్రోసెస్ చెయ్యడానికి సుమారుగా 300 నుండి 500 చదరపు అడుగులు ఉన్న భవనం (ఇల్లు/దుకాణం ) సరిపోతుంది. గాలి, వెలుతురు, నీటివసతి, శుభ్రపరచడానికి అనువైన ఫ్లోరింగ్ అవసరం. ప్లాంట్ పెట్టాలనుకున్న ప్రదేశానికి చుట్టుపక్కల గల పాడి పశువులు శాతం ఎంతవరకు ఉన్నది, వాటి వయస్సు, జాతి, అంటే పాల లభ్యత ఏవిధంగా ఉందో తెలుసుకోవాలి. పాల వ్యాపారులు/రైతులు పాలని ఏవిధంగా విక్రయిస్తున్నారు ఏ రేటుకి విక్రయిస్తున్నారో తెలుసుకోవాలి. పాల యొక్క నాణ్యత పరిక్షించుకోవాలి.
వచ్చే లాభమెంత..?
ఉదాహరణకి ఒక 500 లీటర్ల పాల ప్రొసెస్సింగ్ ప్లాంట్ కి ఏఏ వసతులు కావాలి, ఎంత పెట్టుబడి కావాలి ఎంత లాభం వచ్చే అవకాశం ఉందో చూద్దాం:
ప్లాంట్, మౌలికవసతులు గల (రోడ్.నీరు మొదలైన సదుపాయాలు) గల ఒక మేజర్ పంచాయితీలో పెట్టగలిగితే మంచిది. పాల యొక్క ధర నిర్ణయం FAT / SNF పరీక్ష ద్వారా నిర్ణయించాలి. ఈ షరతులు పాటించి వ్యయ నిర్ణయం లాభనిర్ణయం జరిగిందని గమనించండి.
-
ప్లాంట్ కి కావలసిన యంత్రసామాగ్రి వీటినే స్థిర ఆస్థులు గా చెప్పవచ్చు (ఉదాహరణకి బరువు తూచే యంత్రం, Bulk Cooler, Refrigeration unit, Cream Separator, Fat testing machine etc. ). వీటికి సుమారుగా 6,50,000 రూపాయలు అవుతుంది.( ఇందులో భవనం అద్దె కలుపలేదు).
-
పాల కొనుగోలు, సిబ్బంది జీతాలు, బ్యాంక్ వడ్డీ మొదలైన ఖర్చులు; పాలు, వెన్న అమ్మకము ద్వారా రొజుకు వచ్చే ఆదాయము వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొంటే రొజుకు సుమారుగా 3,000 రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంది.
-
ఇవి కాక నిలువ ఉండే పనీర్, నెయ్యి మొదలైన అదనపు ఉత్పత్తులు చెయ్యగలిగితే మరింత వ్యాపారం విస్తరిస్తుంది.
పాలు సంపూర్ణపోషకాహారం అంటారు. పసిపిల్లలు, రోగులు, గర్భిణీలు,ఎక్కువగా ఆధారపడే పాలు అమ్మకంలో నాణ్యత పాటించండి. శుభ్రతని పాటించండి. ఆరోగ్యాలకి హాని చేసే రసాయనాలు కలపకండి. మీరు పాటించే విలువలు మీ వ్యాపారానికి ప్రధమ పెట్టుబడి. వినియోగదారుని విశ్వాసం చూరకొనటమే అసలైన లాభార్జన.
ఇప్పటి వరకు Milk Processing Unit with minimum capacity గురించి చర్చించాము. ఇప్పుడు, మిల్క్ ప్రొసెస్సింగ్ యూనిట్ లో వాడే మెషినరీ వివరాలు తర్వాత వ్యాపార విస్తరణకి ఈ యూనిట్ కి అనుబధంగా తయారు చేసే ఉత్పత్తులు Creamery Unit , Khoa Processing, Paneer etc గురించి చుద్దాం:
మిల్క్ ప్రొసెస్సింగ్ యూనిట్ లో వాడే మెషినరీ వివరాలు :
The machinery should be made of good quality stainless steel.
Details of Machinery :
1. Building 300 – 500 s.qft floor area Rent/ Own
2. Double jacketed vat for heating milk (Stainless steel – 250 lts capacity )
3. Bulk cooler
4. Refrigeration Unit
5. Cream separator
6. Weighing machine
7. Sealing machine
8. Fat testing machine
9. Cans, plastic containers etc. ఈ మొత్తం మెషినరీ (500 lts per day ) కి ఇంచుమించుగా Rs. 6,50,000.00 అవ్వవచ్చును.
Setting Up Creamery Unit , Khoa Processing, Paneer etc :
రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము ఉంటే మిగిలిన ఉత్పత్తులు (Creamery, Khoa Processing,Paneer etc) లాభసాటిగా చేయవచ్చు.
Creamery Unit :
Capital Investment
01. Building 240 Sq.Ft
02. Cream separator 500 liters/hr
03. Ghee Boiling Vat
04. Gas Burner
05. High power regulator for burner
06. Weighing balance
07. Containers 100 ltr capacity 3 numbers (for cream storage)
08. Buckets, spatula , G.I drum and miscellaneous items
సాధారణంగా పైన చెప్పినవి కావాలి. వాటి కి సుమారు గా Rs. 5,00,000/-దాకా అవుతుంది. రోజుకి నికర ఆదాయము సుమారుగా Rs. 2,000/- దాకా వస్తుంది.
Khoa Processing Unit:
రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము లో 300-400 లీటర్లు Khoa కోసం కేటాయించు కొంటే మంచిది. దీనికి …..
Capital Investment
01. Building 100 Sq.Ft
02. Equipment for dessication and others కి సుమారు గా Rs. 1,50,000/- దాకా అవుతుంది. రోజు కి నికర ఆదాయము సుమారు గా Rs. 1,000/- దాకా వస్తుంది.
Paneer Processing Unit:
రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము లో 300-400 లీటర్లు Paneer కోసం కేటాయించు కొంటే మంచిది. దీనికి కావలసిన Capital Investment:
01. Building 150 Sq.Ft
02. Refrigeration units, bhatti and others కి సుమారు గా Rs. 2,50,000/- దాకా అవుతుంది.రోజు కి నికర ఆదాయము సుమారు గా Rs. 1,500/- దాకా వస్తుంది.
మరి కొంచెం వివరంగా…
-
స్వచ్చమైన గేదెపాలు -4 లీటర్ల లేదా స్వచ్చమైన ఆవు పాలు -5 లీటర్ల నుంచి… 1 కిలో పచ్చి కోవా వస్తుంది
-
స్వచ్చమైన గేదెపాలు -5 లీటర్ల లేదా స్వచ్చమైన ఆవు పాలు– 6 లీటర్ల నుంచి … 1 కిలో పన్నీర్ వస్తుంది
-
10 లీటర్ల స్వచ్చమైన గేదె పాలు నుంచి
-
1 కిలో వెన్నవస్తుంది లేదా ఈ వెన్ననుంచి 750 gms దాకా నెయ్యి వస్తుంది.
-
వెన్నతీసిన తర్వాత 8 లీటర్ల పాలుఉంటాయి. వీటిని హొటళ్ళకు అమ్మవచ్చు లేదా ఈ పాల నుంచి 7 కిలోల దాకా పెరుగు వస్తుంది దీనిని కూడా అమ్మవచ్చు.
-
- పైన చెప్పిన వివరాలు సాదారణం గా వచ్చే ధరలు. ఇవి ప్రాంతాన్ని బట్టి , సీజన్ బట్టి, పాల నాణ్యతను బట్టి మారతాయి.
- ఇక్కడ మనం చూసింది చాలా ప్రాధమిక అంచనాలు. ఈ పాలు, పాల సంభందిత ఉత్పత్తుల వ్యాపారంలో చాలా అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల ప్రొసెస్స్ లలో పెట్టుబడి కూడా ఎక్కువ కావాలి. అలాగే, పెట్టిన పెట్టుబడికి తగినట్ట్లుగా లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, మీరు ఏ ప్రాంతంలో ప్లాంట్ పెట్టబొతున్నరో ఒక సారి మర్కెట్ సర్వే చేసుకుని, ఆర్ధిక ప్రగతిని సాధించండి.
All the best