స్వయం ఉపాధి – సేంద్రియ వ్యవసాయము

By | January 26, 2019

స్వయం ఉపాధి – సేంద్రియ వ్యవసాయము 

సేంద్రీయ ఉత్పత్తులని ( Organic Products ) వాడట్లేదా?

రసాయన ఎరువులుపురుగుమందులు విచక్షణా రహిత౦గా వాడటం వలన తాత్కాలికంగా ఉత్పత్తి అయితే పెరగవచ్చు కానీ దీర్ఘకాలికంగా చూస్తే అటు భూసారాన్ని ఇటు మానవాళి ఆయువుని ప్రభావితం చేస్తున్నాయి.

ముఖ్యంగా చిన్నపిల్లలుగర్చస్థ శిశువుల ఆరోగ్యాల మీద వీటి ప్రభావం ఎంతైనా వు౦దికొన్ని రకాల కేన్సర్లులుకేమియా వంటి ప్రాణాంతక జబ్బులు ,కాలెయ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా నుంచి 14 సంవత్సరాల పిల్లల్లో ఈ వ్యాధుల బారిన పడే శాతం ఎక్కువ అయ్యింది.. గర్భస్థ శిశువులలో పుట్టుకతో ఏర్పడే అవయవ లోపాలే కాకుండా ఎదుగుదల మీద కూడా ఈ కాలుష్య పూరిత ఆహార ప్రభావం ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చును.కాలుష్య పూరిత ఆహార ప్రభావం వీరి మీదనే కాదుఅన్ని వయసుల వారి మీద ఉంటుందిరోగనిరధక శక్తి తగ్గిపోవడం వ్యంధ్యత్వం ఇలా చాలారకాలు గా వీటి ఫలితాలు ఉంటున్నాయి.

సేంద్రీయ ఉత్పత్తులని( Organic Products ) మన ఆహారంలో భాగం చెయ్యడం ద్వారా ఈ ముప్పు ను౦చి చాలా వరకు తప్పించుకోవచ్చు .సేంద్రీయ ఉత్పత్తులు వాడటం వలన కేవలం ఆరోగ్య పరిరక్షణే కాదు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి.

హరిత విప్లవం ద్వారా పెంచుకున్న ఉత్పత్తి రేటు స్థిరం గా ఉండిపోయింది.సేంద్రీయవ్యవసాయపద్ధతులు అమలు చేయడం వలన ఉత్పత్తి శాత౦ పెంచుకోవచ్చునాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారం లభిస్తుంది.సేంద్రీయవ్యవసాయఉత్పత్తులలో పీచు పధార్ధం అధిక శాతం లో ఉంటుంది.ప్రకృతి సంబంధమైన ఎరువులని వాడటం వలన భూసారం దెబ్బ తినదు.తద్వారా భూగర్భ జలాలు కూడా కలుషితం కావుసేంద్రీయవ్యవసాయపద్ధతి లో వ్యవసాయానికి నీటి వనరులు కూడా ఆదా అవుతాయిఎరువులకై పశుపోషణ చెయ్యడం వలన పాడి రూపం లో రైతుకి అదనపు ఆదాయం సమకూరుతుంది.సహజం గా లభించే వ్యర్ధాలు ఎరువులుగా పురుగు మ౦దులుగా వాడట౦ వలన రైతుపై ఆర్ధిక౦గా అదనపు భారం తప్పుతుందిప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయవ్యవసాయఉత్పత్తుల కి ఏటా 10% వరకు మార్కెట్ పెరుగుతో౦ది.సేంద్రీయవ్యవసాయం మన దేశానికి క్రొత్త కాదుమరుగున పడిందిదీనిని ఆదరించాల్సిన బాద్యత మన అందరిదీ.

సేంద్రీయవ్యవసాయం వలన ప్రయోజనం ఒక్క వ్యవసాయదారునికే కాదుమన అందరికీ కూడా.

సేంద్రీయవ్యవసాయఉత్పత్తులని ప్రోత్సహించండిభూసారాన్నిభావితరాలని కాపాడండి. ఈ రంగం లో ఉన్న వ్యాపారఉద్యోగ అవకాశాలు మరోసారి

All the best

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *