స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి) …

By | October 13, 2015

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి) ద్వారా జరిగే నియామకాలు :

మన దేశం లో క్రమం తప్పకుండా, ప్రతీ సంవత్సరం ఉద్యొగ నియామకాలకి నొటిఫికేషన్ విడుదలచేస్తూ వివిద కేంద్ర ప్రభుత్వ ఉద్యొగాలను భర్తీ చేసే సంస్థల్లో యు.పి.ఎస్.సి, ఎస్.ఎస్.సి., .బి.పి.ఎస్ ప్రధానమైనవి. ఇప్పుడు మనం ఎస్.ఎస్.సి ద్వారా జరిగే నియామకాల గురించి చూద్దాము.
ఎస్.ఎస్.సి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ లలోని వివిధ విభాగలలో ఉద్యొగాల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు పదవ తరగతిలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల నుండి, డిగ్రీ లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల వరకు అందరికీ తగిన ఉద్యొగాలకు అర్హత ఉంది. ఆ వివరాలు:


1.
పదవతరగతి అర్హతతొ : పార మిలటరీ దళాలలో ( బి.ఎస్.ఎఫ్., సి.అర్.పి.ఎఫ్., .టి.బి.పి మొదలైన) కానిస్టేబుల్, మల్టీ టాస్కింగ్నాన్ టెక్నికల్
2.
పాలిటెక్నిక్ డిప్లొమ అర్హతతొ : కొన్ని ప్రభుత్వ శాఖలలో ఇంజనీర్ జూనియర్ ఇంజనీర్స్
3.10+2 /
ఇంటర్ అర్హతతొ : ఎల్.డీ.సి. (లోయర్ డివిజన్ క్లర్క్ )., డాటా ఎంట్రీ అపరేటర్స్ ., స్టెనోగ్రఫెర్స్ మొదలైనవి. – కంబైనెడ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL)
4.
డిగ్రీ అర్హతతొ : ఇనస్పెక్టర్, సబ్ఇనస్పెక్టర్ పోస్టులు ఇంకంటాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, సి.బి.., సి.అర్.పి.ఎఫ్, బి.ఎస్.ఎఫ్ మొదలైన వాటిలో. – కంబైనెడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL)
ఇప్పుడు ఈ ఈ పరీక్ష ల గురించి మరికొంత వివరంగా:

1. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్:
సాధరణంగా ఈ పరీక్ష ప్రక్రియ నవంబర్ నెలలో ప్రారంభమై 6 నెలలొపుగా పూర్తి అవుతుంది.
1.
విద్యార్హత: పదవతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు.
2.
వయస్సు: 18 సం. నుండి 25 సం. (ఎస్.సి., ఎస్.టి. లకు 5 సం., .బి.సి. అభ్యర్థులకు 3 సం సఏఅలింపు ఉంది.)
3.
ఎంపిక విధానము: వ్రాత పరీక్ష అధారంగా జరుగుతుంది. ఈ పరీక్ష లో రెండు విభాగా లు ఊంటాయి. మొదటి విభాగం పుర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనూ రెండవ విభాగం డిస్క్రిప్టివ్ విధానంలోనూ ఉంటుంది.
మొదటి విభాగం లో నాలుగు సబ్జక్టులు ఉంటాయి మరియు రెందు గంటల వ్యవధిలో పూర్తి చెయాలి.
సబ్జక్టులు:
న్యుమరికల్ ఆప్టిట్యూడ్ -25 మార్కులు – 25 ప్రశ్నలు
జనరల్ ఇంటెలిజెన్స్ / రీజనింగ్ – 25 మార్కులు – 25 ప్రశ్నలు
జనరల్ ఇంగ్లీష్ – 50 మార్కులు – 50 ప్రశ్నలు
జనరల్ ఎవేర్నెస్ – 50 మార్కులు – 50 ప్రశ్నలు

రెండవ విభాగంలో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది దీనికి 50 మాకులు మరియు 30 నిమిషాల వ్యవధి లో పూర్తిచేయాలి

2.జూనియర్ ఇంజనీర్స్:
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ , సెంట్రల్ వాటర్ కమీషన్, బోర్డర్ రోడ్స్ , మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్సెస్ వంటి సంస్థలలో జూనియర్ ఇంజనీర్ల నియమకానికి ఎస్.ఎస్.సి. ఈ పరీక్ష నిర్వహిస్తుంది.

1. విద్యార్హత: సివిల్ / ఎలక్ట్రికల్ / మెకనికల్ డిగ్రీ లేద డిప్లొమా లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు.
2.
వయస్సు: 18 సం. నుండి 27 సం. (ఎస్.సి., ఎస్.టి. లకు 5 సం., .బి.సి. అభ్యర్థులకు 3 సం సఏఅలింపు ఉంది.)
3.
ఎంపిక విధానము: వ్రాత పరీక్ష, ఇంటర్వ్యు అధారంగా జరుగుతుంది. ఈ పరీక్ష లో రెండు విభాగా లు ఊంటాయి. మొదటి విభాగం పుర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనూ రెండవ విభాగం డిస్క్రిప్టివ్ విధానంలోనూ ఉంటుంది.
మొదటి విభాగం లో నాలుగు సబ్జక్టులు ఉంటాయి మరియు రెందు గంటల వ్యవధిలో పూర్తి చెయాలి.
సబ్జక్టులు:
జనరల్ ఇంటెలిజెన్స్ / రీజనింగ్, జనరల్ ఎవేర్నెస్, జనరల్ ఇంజనీరింగ్

రెండవ విభాగంలో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది దీనికి జనరల్ ఇంజనీరింగ్ ఉంటుంది. దీనిని రెండు గంటల వ్యవధి లో పూర్తిచేయాలి.

3.కంబైనెడ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL):
సాధరణంగా ఈ పరీక్ష ప్రక్రియ జూన్ నెలలో ప్రారంభమై 6 నెలలొపుగా పూర్తి అవుతుంది.
1.
విద్యార్హత: 10+2 లేదా తత్సమాన విద్యార్హత కలిగివుండలి.
2.
వయస్సు: 18 సం. నుండి 27 సం. (ఎస్.సి., ఎస్.టి. లకు 5 సం., .బి.సి. అభ్యర్థులకు 3 సం సఏఅలింపు ఉంది.)
3.
ఎంపిక విధానము: వ్రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ అధారంగా జరుగుతుంది. ఈ పరీక్ష లో రెండు విభాగా లు ఊంటాయి. మొదటి విభాగం పుర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనూ రెండవ విభాగం స్కిల్ టెస్ట్ విధానంలోనూ ఉంటుంది.
మొదటి విభాగం లో నాలుగు సబ్జక్టులు ఉంటాయి మరియు రెందు గంటల వ్యవధిలో పూర్తి చెయాలి.
సబ్జక్టులు:
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -50 మార్కులు – 50 ప్రశ్నలు
జనరల్ ఇంటెలిజెన్స్ / రీజనింగ్ – 50 మార్కులు – 50 ప్రశ్నలు
జనరల్ ఇంగ్లీష్ – 50 మార్కులు – 50 ప్రశ్నలు
జనరల్ ఎవేర్నెస్ – 50 మార్కులు – 50 ప్రశ్నలు

రెండవ విభాగంలో స్కిల్ టెస్ట్ ఉంటుంది ఈ స్కిల్ టెస్ట్ క్వాలిఫైంగ్ పరీక్ష మాత్రమే. ఎంపిక వ్రాత పరీక్ష ఆధారంగానే జరుగుతుంది.

4. కంబైనెడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (CGL) :

ఎస్.ఎస్.సి వారు ఈ పరీక్ష ద్వారా వివిధి కేంద్ర ప్రభుత్వ విభగాలలో గ్రూప్ బి., గ్రూప్ సి. కేటగిరీ పోస్ట్లను భర్తీ చెస్తారు. ఈ పరీక్ష ద్వారా ఇనస్పెక్టర్ (ఇన్ కంటాక్స్), అస్సిస్టెంట్ ఇనస్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజు), ఇనస్పెక్టర్ (ప్రివెంటివె ఆఫీసర్ ), ఇనస్పెక్టర్ (ఎగ్జామినర్), అస్సిస్టెంట్ ఎనఫొర్సెమెంట్ అఫీసర్, సబ్ ఇనస్పెక్టర్ (సి.బి.) ,సెక్షన్ అఫీసర్ (ఆడిట్) / ( కమర్షియల్ ఆడిట్), డివిజనల్ అకౌంటెంట్ మొదలైన వివిద ఉద్యొగాలకు అర్హులైన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఈ ఈ ఉద్యొగాలకు కావలసిన అర్హతలు మొదలైన వివరాలు క్లుప్తంగా:

విద్యార్హత : ఎదేని గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయము నుండి డిగ్రీ పొంది ఉండాలి.

(కొన్ని ప్రత్యేక ఉద్యొగాలకు సంబందిత సబ్జెక్ట్ ఒక పాఠ్యాంశంగా కలిగి ఉండాలి)

ఈ పరీక్ష మూడు అంచెలలో జరుగుతుంది. అవిప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష తరువాత ఇంటర్వూ. అభ్యర్ధి ప్రతీ అంచెలోనూ సాధించిన మార్కులను కలిపె తుది జాబితాను ఎంపిక చెస్తారు.

1. ప్రిలిమనరీ పరీక్ష పూర్తిగా అబ్జెక్టివ్ పద్దతి లో జరుగుతుంది. ఇందులో నాలుగు సబ్జెక్టులు ఉంటాయి

అవి– 1. జనరల్ ఇంటిలెజెన్స్, రీజనింగ్

2. జనరల్ ఎవేర్నెస్

3. న్యుమరికల్ ఎబిలిటీ

4. జనరల్ ఇంగ్లీష్

ఒక్కొక్క సబ్జెక్ట్ లో 50 ప్రశ్నలు, 50 మార్కుల తో మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష కాల వ్యవధి 2 గంటలు.

2. రెండో అంచె పరీక్ష అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఉద్యొగం అధారంగా జరుగుతుంది. వీటిలో 1. అర్థమెటిక్స్ 2. ఇంగ్లీష్ 3. మాథ్స్ / ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / కామర్స్ వంటి పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్ లో 200 మార్కుల తో మొత్తం 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష కాల వ్యవధి సబ్జక్టుకు 2 గంటలు చొప్పున.

ఈ రెండు అంచెలలో నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.

3. ఇక మూడో అంచెపర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. కొన్ని పొస్టుల బట్టి స్కిల్ టెస్ట్ / శారీరిక పరీక్షా కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 మర్కులకు ఉంటుంది.

ఈ మూడు అంచెలలో అభ్యర్థి సాధించిన మార్కుల బట్టి తుది జాబితా ప్రకటిస్తారు.

సాధారణంగా ఈ నోటిఫికేషన్ మే నెలలో వస్తుంది ప్రక్రియ 6 నెలలొపుగా పూర్తి అవుతుంది.

Leave a Reply

Your email address will not be published.