జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ :
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సంస్థలకి జియాలజిస్ట్ లని యు.పి.ఎస్.సి. ఈ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంది. ఈ పరీక్ష కింద
కేటగిరీ-1 లో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ మైన్స్
కేటగిరీ-2 లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఇరిగేషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ లలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో నియమిస్తారు.
ఈ పరిక్ష వ్రాయగోరే అభ్యర్ధికి కావల్సిన అర్హతలు:
అభ్యర్ధి వయస్సు : 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సి, ఎస్టి, ఒబిసి, రక్షణ రంగాలలో పనిచేసిన వారికి ప్రభుత్వ నియమాలని అనుసరించి సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు : జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/ మినరల్ ఎక్స్ ప్లోరేషన్/ హైడ్రొజియాలజీ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్ బాద్ నుంచి డిప్లొమా కానీ ఉండాలి.
వ్రాత పరీక్ష :
జనరల్ ఇంగ్లీష్ లో ఒక పేపర్ లో జియలాజి పైన నాలుగు పేపర్లు ఉంటాయి. వ్రాత పరిక్షలో ఉతీర్లులైన వారికి మౌఖిక పరిక్ష ఉంటుంది. వ్రాత పరిక్ష 900 మార్కులకి, ఇంటర్వూలకి 200 మార్కులకి ఉంటుంది.
వ్రాత పరిక్షలలో ఉత్తీర్ణులైన వారికి మౌఖిక పరిక్ష ఉంటుంది.