కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్:
భారత దేశ త్రివిధ దళాలలో అఫీసర్లుగా చేరాలనుకునేవారికి ఈ పరీక్ష అవకాశంకల్పిస్తుంది. ఈ పరీక్ష ను యు.పి.ఎస్.సి నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా నాలుగు రకాల భర్తీలు జరుగుతాయి. అవి–
1. డెహ్రడూన్ లోని భారతీయ మిలటరీ అకాడమీ
2.నేషనల్ అకాడమీ గోవా
3.హైదరాబాద్ లోని ఎయిర్ ఫొర్స్ స్టేషన్
4. చెన్నై లోని అఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ
పరీక్షా విధానము:
ఈ పరీక్ష 1. డెహ్రడూన్ లోని భారతీయ మిలటరీ అకాడమీ , 2.నేషనల్ అకాడమీ గోవా, 3.హైదరాబాద్ లోని ఎయిర్ ఫొర్స్ స్టేషన్ లకు ఒక రకంగాను; చెన్నై లోని అఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కి ఒక రకంగాను ఉంటుంది.
వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్యూ , ఇంటిలిజెన్స్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ,ప్లానింగ్ వంటివి ఉంటాయి.
శిక్షణ: అన్ని పరీక్షలలొ ఉత్తీర్ణులైన వార్కి వివిధ అకాడమీలలో కఠినమైన శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో వసతి, పుస్తకాలు, యూనిఫారం, వైద్యం వంటి అనేక సదుపాయాలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది. శిక్షణ పూర్తి అయిన వారు ఆఫీసర్లు గా త్రివిధ దళాలో చేరతారు.
ఈ పరీక్షలకు అర్హతలు మరియు ఇతర వివరాలను త్వరలో చూద్దాం…