ఇండియన్ ఎకనామిక్ / ఇండియన్ స్టాటస్టికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్:
ధన మూలమిదమ్ జగత్ అన్నారు పెద్దలు. దీనిని బట్టే మన జీవితంలో ధనం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఇది వ్యక్తిగతజీవితానికే కాదు దేశం యొక్క అభివృద్ధి కి కూడా ఆర్ధికరంగ పరిపుష్టత చాలా అవసరం. దేశ అభివృద్ధికి ఏ ఏ రంగం లో ఎంత పెట్టుబడులు పెట్టాలి ఎంత నిధులు కేటాయించాలి వంటి వాటిని ఆర్ధిక నిపుణులు నిర్ణయిస్తారు. ఆర్ధిక వృద్ధి లెక్కలకి ఈతర సూచీలకి పెట్టిన పెట్టుబడి ఏ విధంగా ఉపయోగపడిందీ అన్నది నిర్ణయించడానికి స్టాటస్టికల్ సర్వీసెస్ అవసరం. ఈ విధంగా ఆర్ధిక రంగం / స్టాటస్టికల్ దేశ ఆర్ధిక రంగంలో కీలకమైనవి. ఇంత కీలకమైన ఈ రంగాలలో లో ఉన్నత స్థాయి ఉద్యోగాల కొరకు యు.పి.ఎ.సి. నిర్వహించే పరిక్షయే ఇండియన్ ఎకనామిక్/ ఇండియన్ స్టాటస్టికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ . ఈ సర్వీసెస్ లో ఎంపిక అయిన అభ్యర్ధులు, ఫైనాన్స్, కామర్స్, ఇండస్ట్ర్రీ , బ్యాంకింగ్, స్టాటస్టికల్ మొదలైన శాఖలలో నియమించబడతారు.
ఈ పరిక్షకు హాజరయ్యే అభ్యర్దులకి అర్హతలు :
వయస్సు :
అభ్యర్ధి వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్.సి., ఎస్.టి.,ఒ.బి.సి, రక్షణ రంగాలలో పనిచేసిన వారికి ప్రభుత్వ నియమాలని అనుసరించి సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు:
1. ఇండియన్ ఎకనామిక్స్ సెర్విసెస్ : ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి.
2. ఇండియన్ స్టాటిస్టికల్ సెర్విసెస్ : స్టాటస్టిక్స్, మేథమిటికల్ స్టాటస్టిక్స్, అప్లైడ్ స్టాటస్టిక్స్, లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.
వ్రాత పరీక్ష :
ఈ రెండు పరిక్షలకి ఆరు పేపర్లుంటాయి.
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ : జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, ఎకనామిక్స్ పైన నాలుగుపేపర్లు.
ఇండియన్ స్టాటస్టిక్స్ సర్వీస్ : జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, స్టాటస్టిక్స్ పైన నాలుగు పేపర్లు.
అన్ని పేపర్లు ఇంగ్లీష్ లోనే ఉంటాయి. ఇంగ్లీష్ లోనే జవాబులు వ్రాయాలి.
మొత్తం వ్రాతపరిక్షకి 1000 మార్కులు, ఇంటర్వూ కి 200 మార్కులుంటాయి.
వ్రాత పరిక్షలో ఉత్తీర్ణులైన వారికి మౌఖిక పరిక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.