హామీ / తనఖా లేని ఋణాలు…

By | March 2, 2015

హామీ / తనఖా లేని ఋణాలు…

సాధారణంగా ఏదైనా పరిశ్రమ / సేవల రంగంలో వ్యాపారం ప్రారంభించాలి అంటే  బ్యాంక్ లోన్ చాలా సంధర్భాలలో అవసరమవుతుంది. బ్యాంక్ లోన్ లేకుండా పూర్తిగా ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన సొంత పెట్టుబడి తోనే ప్రారంభించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్ లు  సాధారణంగా ఎక్కువ వ్యయంతో కూడి ఉంటాయి. కాబట్టి, బ్యాంక్ లోన్  తప్పనిసరి అవుతుంది.


సాధారణంగా ఋణం మంజూరుకి బ్యాంక్ వారు ప్రాజెక్ట్ ఎవరు  ప్రారంభిస్తున్నారు, ? వారి శక్తిసామర్ధ్యాలని, ఆ ప్రాజెక్ట్ కి ఉన్న మార్కెట్ అవకాశాలని అంచనా వేసుకుంటారు. తరువాత, ఇవ్వబోయే ఋణానికి తగిన హామీ, తనఖా ఉందా ? అన్నది చూస్తారు.
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి వ్యాపారం చెయ్యగల శక్తిసామర్ధ్యాలు ఉండి , చేయబోయే ప్రాజెక్ట్ కి తగిన మార్కెట్ ఉండి కూడా తగిన హామీ ఇవ్వలేకపోవడం వలన ఋణం పొందలేని పరిస్తితులు చాలాసార్లు వస్తాయి.
ఈ హామీ ఇవ్వలేని/ తనఖాకి సరైన ఆస్తులు లేనివారికి ఈ ఇబ్బందులు లేకుండా పరిశ్రమలకి అప్పులు ఇవ్వడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అర్హులైన వారికి  కోటి రూపాయల ఋణం వరకు హామీ లేని ఋణాలని  ( అర్హత ని అనుసరించి ) మాత్రమే మంజూరు చెయ్యాలని నిర్దేశించింది.
అర్హులైన పారిశ్రామికవేత్తలు అంటే  Micro & Small enterprises Development Act 2006 ( MSMED)  నిర్వచనం ప్రకారం అర్హులైనవారు.
ఈ చట్టం క్రింద వ్యాపార సంస్థలని  రెండురకాలుగా విభజించారు.
పరిశ్రమలు ( Industrial enterprises)  :  తయారీ , ప్రొసెస్సింగ్ , లేదా వస్తువులని నిలవ చెయ్యడంలో ఉన్న సంస్థలు.
సేవా సంస్థలు ( Service Enterprises )  :  సేవలని కలిపించే సంస్థలు ఉదా.  Small road and water transport operators, professionals and self employed persons.
అయితే ఈ  సంస్థ లని ఆయా సంస్థలు “ఒరిజినల్” పెట్టుబడి ఆధారంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు ( Micro , Small , Medium Enterprises ) గా విభజించారు. ఒరిజినల్ పెట్టుబడి అంటే భూమి మరియు భవనసముదాయం పైన పెట్టుబడిని మినహాయించి , Ministry of SSI  నిబంధనలని అనుసరించి పెట్టిన పెట్టుబడి.

అదేవిధంగా సేవాసంస్థల విషయంలో పెట్టుబడి అంటే భూమి, భవనం , ఫర్నిచర్, మరియు ఇతరవస్తువులు , ఆస్తులపైన పెట్టిన పెట్టుబడి కాకుండా, అంటే, ఆయా సేవలు అందిచడానికి ప్రత్యక్షంగా అవసరమయ్యే ఆస్తుల పైన పెట్టే పెట్టుబడిని పరిగణనలోనికి తీసుకుంటారు.

అయితే సంస్థలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలుగా  ఎలా విభజిస్తారు ?

విభజన                                            ఒరిజినల్ పెట్టుబడి
 పరిశ్రమలు  సేవా సంస్థలు
సూక్ష్మ సంస్థలు  25 లక్షల రూపాయిల  వరకు  10 లక్షల రూపాయిల  వరకు
 చిన్న సంస్థలు  25 లక్షల రూపాయిల  నుండి  5 కోట్ల రూపాయిల వరకు  10 లక్షల రూపాయిల  నుండి  2 కోట్ల రూపాయిల వరకు
 మధ్యతరహా సంస్థలు  5 కోట్ల రూపాయిల నుండి 10 కోట్ల రూపాయిల వరకు  2 కోట్ల రూపాయిల నుండి 5 కోట్ల రూపాయిల వరకు

 

ఈ నిభంధనలకి అనుగుణంగా ఏర్పాటు ఐన సంస్థలు ఒక కోటి వరకు పొందే అప్పులకి బ్యాంక్ హామీ లేని ఋణాలని మంజూరు చెయ్యాలి ( ఆయా బ్యాంకుల నియమ నిభందనలను అనుసరించి అర్హులైన వారికి ). కానీ, చిల్లర టొకు వర్తకాలు, విద్యాసంస్థలు, స్వయం సహాయక బృందాలు  ఈ పధకం క్రింద ఋణం పొందుటకి వీలులేదు.

ఈ హామీ లేని ఋణాలని బ్యాంకులు  CGTMSE ( Credit Guarantee Fund Trust for Micro, Small and Medium Enterprises ) సంస్థ యొక్క Credit Guarantee Scheme  క్రింద మంజూరు చేస్తారు.

CGTMSE నిబంధనలు కొన్ని,  క్లుప్తంగా :

  • అర్హుడైన ఋణగ్రహీత కి కోటి రూపాయిల వరకు ఋణం.
  • ఏ విధమైన తనఖా ను  (Collateral security) బ్యాంకు లు తీసుకోరాదు.
  • ఏ విధమైన  మిగిలిన / ఇతర అప్పులను తీర్చడానికి ఈ ఋణాన్ని వాడరాదు.
  • CGTMSE గ్యారంటి  అయిదు సంవత్సరముల వరకు వర్తిస్తుంది.
  • Guarantee fee, Annual Service fee ను చెల్లిస్తూ ఉండాలి.

మిగిలిన వివరాలు త్వరలొ…