బ్యాంకింగ్ రంగంలో సువర్ణావకాశం…

By | April 14, 2015

బ్యాంకింగ్ రంగంలో సువర్ణావకాశం

(… updated on 11.03.2019)

నిరుద్యోగులకు, రాబొయే 2-3 సంవత్సరాలలొ బ్యాంకింగ్ రంగంలో సువర్ణావకాశం లభించబోతోంది.

గత సంవత్సరంలో దేశంలోని అన్ని బ్యాంక్ లలో మొత్తం మీద 60000 దాకా ఉద్యొగాలు ఖాళీలు ఉన్నాయి అన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. దీనితో పాటుగా రాబొయే 2 – 3 సంవత్సరాలలో సుమారుగా మూడవ వంతు ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. దీనిని బట్టి ఉద్యొగావకాశాలు ఇంకా పెరుగుతాయి అని అర్ధం చేసుకోవచ్చు.ఇందుకు అనుగుణంగానే వివిధ బ్యాంకులు భారీగా నియామకాలు ప్రారంభించాయి / కొనసాగిస్తున్నాయి.

అయితే బ్యాంకులలొ ఈ పరిస్థితి ఒక్కసారిగా వచ్చినది కాదు. ప్రత్యేకించి 1990 దశకంలో పెద్దగా విస్తరణ లేక పోవడం, తర్వాత బ్యాంకుల యాంత్రీకరణ (కంప్యూటరీకరణ) జరగడం వలన బ్యాంకులలో పెద్దగా నియామకాలు జరగలేదు. గత 5 -6 సంవత్సరాలుగా శాఖల విస్తరణ బాగా జరగడం, పదవీ విరమణలు జరగడం వలన ఇన్ని ఉద్యొగాలు సృష్టించబడ్డాయి. దీనికి ఫైనాన్షియల్ ఇన్క్లూషన్  కూడా దోహద పడింది.

అయితే ఇన్ని ఉద్యోగావకాశాలు ఉన్నా, పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గతం లొ జరిగిన భారతీయ స్టేట్ బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ 1500 ఉద్యోగాలకు 10 లక్షల కన్నా ఎక్కువ అభ్యర్ధులు పోటీ పడ్దారు. ముందు ముందు మిగిలిన బ్యాంకులకు కూడా అంటే IBPS ద్వారా జరిగే నియామకాలకు కూడా ఇంచుమించుగా పోటీ ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. తీవ్రమైన పొటీ ఉంటుంది అని అభ్యర్ధులు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ప్రణాళికాబద్దంగా తయారు అయితే విజయం తప్పక సిద్ధిస్తుంది. ఇప్పటి నుంచి తయారీ ప్రారంభిస్తే తప్పకుండా వారికి విజయం లభిస్తుంది.